పీపీపీకి చంద్రబాబు కొత్త భాష్యం
నందిగామ టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తూనే కాదు కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త భాష్యం చెబుతున్నారని మాజీ శాసనసభ్యుడు, నందిగామ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు మండి పడ్డారు. చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టిందని, పేద ప్రజలకు అన్యాయం చేయటమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రత్యేక వాహనాన్ని గురువారం రాత్రి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పత్రాలను మీడియా ప్రతినిధుల సమక్షంలో బాక్సులలో సర్దించి ఆయనే స్వయంగా వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా జగన్‌మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మెజార్టీ శాతం కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగం నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయని, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్
మొండితోక జగన్‌మోహనరావు


