15లోగా నివేదికలు అందజేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 15వ తేదీలోగా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సంబంధించిన నివేదికలు అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని, ఇందుకు సంబంధించి వివిధ ప్రభుత్వశాఖల నివేదికలు వెంటనే సిద్ధం చేసి అందించాలన్నారు. వివిధ అంశాలపై ఏమైనా మార్పులు ఉంటే జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో పంపుతామని, అందరూ అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించిన అంశాలు ఉంటే వాటిని ఈసారి పొందుపరచాలని, గత మూడు నెలలుగా జిల్లాలో ఏమైనా కొత్తగా మొదలుపెట్టిన పనులకు సంబంధించిన వివరాల నోట్ లను కూడా అందజేయాలన్నారు. ఆర్టీజీఎస్ లెన్స్ మాస్టర్ డాష్ బోర్డులో చూపుతున్న వివరాలు సరిగా ఉన్నాయో, లేదో ఒకసారి పరిశీలించాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డీఆర్వో శ్రీదేవి, డ్వామా, డీఆర్డీఏ పీడీలు ఎన్‌వీ శివప్రసాద్, డి.హరిహరనాఽథ్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, డీఈవో సుబ్బారావు, డీఎస్‌వో మోహన్‌బాబు, డీఎంఅండ్‌హెచ్‌వో యుగంధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ


