మోతాదుకు మించి వాడేస్తున్నారు
రంగు, రుచి కోసం మాంసాహారంలో మితిమీరిన సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు మేము నిర్వహించిన తనిఖీల్లో గుర్తించాం. ఇటీవల తనిఖీల్లో 40 శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌పరీక్షల కోసం పంపగా, 20 శాంపిల్స్‌లో కల్తీ జరిగినటుల నిర్ధారణ అయింది. వాటిలో 17 సురక్షితమైన ఆహారం కాదని తేల్చారు. వారందరిపై కేసులు నమోదు చేశాం. హోటల్స్‌లో కానీ, ఎక్కడైనా ఆహారం కల్తీ అయినట్లు గుర్తిస్తే ప్రజలు మాకు ఫిర్యాదు చేయవచ్చు. ఫుడ్ లైసెన్స్ లేకుండా హోటల్, రెస్టారెంట్‌లు, ఫుట్‌స్టాల్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– బి. శ్రీనివాసరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి, విజయవాడ


