గాయని సుశీలకు పురస్కారం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ సహకారంలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంటుంది. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనను శుక్రవారం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల పూల మొక్కలు, వైవిధ్య భరితమైన పుష్పాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన ప్రముఖ బోన్సాయ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో బోన్సాయ్ మొక్కల ప్రదర్శన ఆకర్షిస్తోంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపార్థసారథి భాస్కర్, వీఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్‌తో పాటు, సొసైటీ కార్యదర్శి ఘంటసాల లక్ష్మి, స్వామి, పద్మ ప్రియ, సీతా మహాలక్ష్మి, అఖిల పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శివరాజ్‌కుమార్ దంపతులను ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ అందించారు. చైర్మన్ చాంబర్‌లో శివరాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటిస్తున్నానని, దీంతో పాటు రాంచరణ్ సినిమాలో కూడా నటిస్తున్నానన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో దర్శకుడు పరమేశ్వర్ యుగాలేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో రెండు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిద్దరూ జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి రాగా, వారికి స్క్రబ్ టైఫస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. జి. కొండూరుకు చెందిన రెండున్నరేళ్ల బాబు పాత ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో చికిత్స పొందుతుండగా, కంచికచర్లకు చెందిన 45 ఏళ్ల మహిళ కొత్తాస్పత్రి జనరల్ మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు తెలిపారు.
గాయని సుశీలకు పురస్కారం
గాయని సుశీలకు పురస్కారం


