స్కాన్ చేయండి.. పన్నులు చెల్లించండి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసిందని, ఈ వెసులుబాటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం మీ కోసం సమావేశ మందిరంలో జేసీ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్‌లతో కలిసి స్వర్ణ పంచాయతీ – నిమిషాల్లో పన్నులు చెల్లించండి పేరుతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ..
కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే నూతన విధానం ప్రారంభించిందన్నా రు. ఈ పద్ధతిలో సులభంగా పంచాయతీ పన్ను ల న్నీ చెల్లించవచ్చని చెప్పారు. ప్రతి పంచాయతీ కార్యాలయం, సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల్లో వాల్‌పోస్టర్లను ప్రదర్శిస్తామన్నారు. కార్యక్రమంలో డీపీవో జె.అరుణ, బందరు ఆర్డీవో స్వాతి, కేఆర్‌ఆర్‌సీఎస్ డీసీ శ్రీదేవి, సీఐ శ్రీను, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
7న హాకీ శతాబ్ది వేడుకలు
మచిలీపట్నంఅర్బన్: భారత దేశంలో హాకీ క్రీడకు నవంబర్ 7తో 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని స్పందన మీటింగ్ హాల్‌లో హాకీ శతాబ్ది వేడుకల వాల్ పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ భారతదేశపు గర్వకారణమైన జాతీయ క్రీడగా నిలిచిందన్నారు. జిల్లాలో హాకీ అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. హాకీ కృష్ణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన గూడూరులోని జెడ్పీ హైస్కూల్‌లో శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, హాకీ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్, కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, కోశాధికారి పీఎస్ విఠల్, సభ్యులు పాల్గొన్నారు.


