బూడిద లోడింగ్‌ను అడ్డుకున్న లారీ ఓనర్లు
ఇబ్రహీంపట్నం: ఖిల్లా రోడ్డులోని బూడిద చెరువు వద్ద బూడిద లోడింగ్ పనులను లారీ ఓనర్లు అడ్డుకున్నారు. స్థానిక లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు లారీలకు లోడింగ్ ఆపివేయాలని కోరుతూ మంగళవారం ఆందోళనకు దిగారు. లారీ ఓనర్లకు తోడుగా టీడీపీ నాయకులు జత కలవడంతో లోడింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న రెఫెక్స్ సంస్థ ప్రతినిధులు ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. ఈ ప్రాంతంలో బూడిద లోడింగ్ వలన భారీగా కాలు ష్యం పెరిగిందని తెలుసుకున్న కేంద్రం సూచనల తో ఏపీ జెన్‌కో సంస్థ ఇటీవల స్థానిక బూడిద లో డింగ్ కాంట్రాక్ట్‌ను రెఫెక్స్ అనే సంస్థ టెండర్ ద్వా రా దక్కించుకుంది. ఈ విధానంతో ఇప్పటివరకు ఉచితంగా లోడింగ్ చేయించుకున్న లారీ ఓనర్లు ఇప్పుడు లారీ లోడింగ్‌కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. లారీ ఓనర్లు నష్టపోతున్నందున కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేయాలని కోరుతూ ఎన్టీటీపీఎస్ ప్రధాన గేటు సమీపంలో 38రోజుల పా టు లారీ ఓనర్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎ మ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఒక్కొక్క లారీకి నెలకు 12 ట్రిప్పులు ఉచితంగా లోడింగ్ చేసేలా మాట్లాడామని హామీ ఇస్తూ దీక్షను విరమింపచేశా రు. అయితే ఎమ్మెల్యే హామీని తుంగలో తొక్కుతూ ఒక్కొక్క ట్రిప్పుకు రూ.850 నగదు డిమాండ్ చేయడంతో లారీ ఓనర్లు లోడింగ్ పనులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన లారీ ఓనర్లు డబ్బులు చెల్లించి లోడింగ్ చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన లారీ ఓనర్లు ఉచితంగా ఇవ్వాలని రెఫెక్స్ సంస్థ ప్రతినిధులపై బెదిరింపు ధోరణికి దిగారు. ప్రభుత్వ మాది, మాకు ఉచితంగా లోడింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రతినిధులపై బెదిరింపులకు దిగారు. సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ భువనగిరి రాజు సిబ్బందితో అక్కడకు చేరుకుని చైన్నెలో ఉన్న టెండర్‌దారుడికి సమాచారం చేరవేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు లోడింగ్ పనులు నిలిపివేశారు.


