● పౌర్ణమి చంద్రుడు.. కార్తిక దీపమైన వేళ!
కృష్ణా జిల్లాలోని నాగాయ లంక కృష్ణానది తీరంలో మంగళవారం రాత్రి ఏడు గంటల సమయాన ఓ దృశ్యం కనువిందు చేసింది. రామలింగేశ్వరుని మండపం ఎదుట కార్తిక దీప ప్రమిదలను అమర్చి ఉంచారు. ఆ సమయంలోనే ఆకాశంలో చంద్రుడు ఉదయించి పైకి వస్తున్న తరుణంలో జ్యోతులు వెలిగించేందుకు అక్కడ సిద్ధంగా ఉంచిన ప్రమిదలలో వత్తులకు అనుసంధానంగా చంద్రుడు కనిపించిన ఆసక్తికర దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరాలో ఇలా బంధించింది. కార్తిక పౌర్ణమి ఘడియలు మరి కొన్ని గంటలలో ప్రవేశించే ముందు ఆ చంద్రుడే కార్తిక దీపంగా ఆవిష్కృతమైన సోయగం ఇది.
–నాగాయలంక(అవనిగడ్డ)


