నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఎం.అప్పాజీరావు దంపతులు నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందించారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన కె.వెంకటరత్న సుబ్రహ్మణ్య శర్మ, అరుణకుమారి దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని, భవానీపురానికి చెందిన రామలింగేశ్వరరావు, సీతాలక్ష్మి దంపతులు బి.పవన్‌హర్షిత్ శ్రీరామ్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు


