నిబద్ధత లేని అధికారులు – తెరుచుకోని కంట్రోల్ రూమ్‌లు
తుఫాన్ నుంచి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూములు కొన్ని చోట్ల కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటుచేశామని, 24 గంటలూ ప్రజలకు ఈ కంట్రోల్ రూము అందుబాటులో ఉంటుందని చెప్పారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు వెళ్లి పరిశీలించగా అక్కడ కనీసం పలకరించే నాథుడే లేడు. కార్యాలయానికి ఉన్న తలుపులకు తాళాలు కూడా తీయలేదు. పక్కనున్న వీఆర్‌ఓల కార్యాలయం వైపు చూస్తే అది కూడా మూసి ఉంది. స్థానిక బందరు రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన కొత్తగా నిర్మించిన సచివాలయం–1 కు కూడా తాళాలు వేసి ఉండటంతో కంట్రోల్ రూము ఎక్కడుందబ్బా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులే రాత్రింబవళ్లూ కంట్రోల్ రూములో కూర్చుని పర్యవేక్షిస్తుంటే దానికి భిన్నంగా ఇక్కడ కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లిపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
–చల్లపల్లి
నిబద్ధత లేని అధికారులు – తెరుచుకోని కంట్రోల్ రూమ్‌లు
నిబద్ధత లేని అధికారులు – తెరుచుకోని కంట్రోల్ రూమ్‌లు


