
కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
కొనసాగుతున్న అదనపు భవనాల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో పెరిగిన సిద్ధార్థ వైద్య కళాశాల పీజీ సీట్లు అందుకనుగుణంగా రెండేళ్ల కిందటే భవనాలకు నిధులు మంజూరు కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగని పనులు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ భవనంపైనా అదే వివక్ష
నత్తే నయం..
వైద్య రంగంపై వివక్ష సరికాదు
సిద్ధార్థ వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు
ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,450 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 64,450 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి, ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం నత్త నడకన నడుస్తున్నాయి. ఆ పనులను పూర్తిగా నిలిపివేయకుండా.. ‘చేస్తున్నాముగా..’ అనే రీతిలో కొనసాగుతున్నాయి. దీంతో రోగులు, వైద్య విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పన మరింత జాప్యమవుతోంది. పీజీ సీట్లు మంజూరు చేసి, వాటి నిమిత్తం విడుదలైన నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతున్నాయి. దీంతో వైద్య రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వైద్య కళాశాలలోనూ అంతే..
సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయి. పెరిగిన సీట్లకు అనుగణంగా కేంద్రం నుంచి నిధులు మంజూర య్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి అదనపు తరగతి గదులు, లెక్చర్ హాల్స్, లేబొరేటరీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రూ.60 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించగా, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నత్త నడకన నడుస్తున్నాయి. నిధులు అందుబాటులో ఉన్నా, పనులు జరగకుండా నిలిపివేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత ఐదేళ్లూ స్వర్ణయుగం..
వైద్య రంగానికి 2019–24 మధ్యకాలం స్వర్ణయుగం లాంటిదని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదేళ్లలోనే 75 పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల 1986లో ఏర్పా టవగా 2019 వరకూ స్పెషాలిటీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు కేవలం 89 మాత్రమే ఉండేవి. కానీ 2019 తర్వాత వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో 2022లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) స్పెషాలిటీ విభాగాల్లో 14 సీట్లు, సూపర్‌స్పెషాలిటీ (ప్లాస్టిక్ సర్జరీ) రెండు మొత్తం 16 ీపీజీ సీట్లు మంజూరు చేసింది. అంతేకాక 2023లో స్పెషాలిటీ విభాగాల్లో 49, సూపర్‌స్పెషాలిటీ న్యూరాలజీ, న్యూరో సర్జరీల్లో 10 సీట్లు మంజూరయ్యాయి. ఇలా రెండేళ్లలోనే 75 పీజీ సీట్లు తేగలిగారంటే వైద్య రంగానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
I
దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించిన భక్తులకు దేవస్థానం పోస్టల్ ద్వారా ప్రసాదాల పంపిణీ చేపట్టింది. శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలు పంపుతోంది.
గన్నవరం: కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు గన్నవరం పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో బ్లాక్ రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు రెండున్నరేళ్ల కిందట పనులు ప్రారంభించింది. ఆ భవనంలో క్యాజువాలిటీ, ట్రామాకేర్, ఏఎంసీ, అత్యవసర నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యం అవసరమైన వారికి సత్వరమే సేవలు అందుతాయని అధికారులు భావించారు. ఎన్నికల నాటికే రెండంతస్తుల శ్లాబు పూర్తి కాగా, ప్రస్త్తుతం పనులు అస్సలు ముందుకు సాగడం లేదు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మాణ దశలో ఉన్న భవ నాలను పూర్తి చేయాలి. వైద్య విద్యార్థులు మెరుగైన సౌకర్యాల కోసం చేపట్టిన భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ విధానం సరికాదు.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర
ఉపాధ్యక్షుడు,వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా