
దుర్గమ్మ రాకతో పులకించిన కృష్ణాతీరం
హంసవాహన సేవ కోసం ఆది దంపతులు దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ప్రారంభమవగా.. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య దుర్గాఘాట్‌కు బయలుదేరింది. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో హాంస వాహనంపైకి కేవలం 25 మందిని మాత్రమే అనుమతించారు. అనంతరం హంసవాహనంపై అధిష్టించిన ఆదిదంపతులను త్రిలోక సంచారానికి గుర్తుగా మూడు పర్యాయాలు హంస వాహనాన్ని ముందుకు వెనక్కి నడిపించారు.