
రెగ్యులర్ చెకప్ అవసరం
ఒబెసిటీ ఉన్న వారు రెగ్యులర్‌గా బీపీ, షుగర్, కొలస్ట్రాల్ పరీక్షలతో పాటు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒబెసిటీని అధిగమించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువ వస్తాయి. వారిలో మెటబాలిజం దెబ్బతింటుంది. అదుపులో లేని మధుమేహం, రక్తపోటు సమస్యలకు తారి తీస్తుంది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్‌లు, ఐస్‌క్రీమ్‌లు తినకుండా ఉండటం ఉత్తమం
– డాక్టర్ ఎం.శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు, విజయవాడ
●