
యూరియా కోసం బారులు
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరులోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా ఆ సెంటర్‌కు తరలివచ్చారు. అన్నదాతల రద్దీని దృష్టిని పెట్టు కుని తోపులాట జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం. అయితే గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా దొరక్కపోవడంతో కొంత మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఒక్కొక్క రైతుకు రెండు యూరియా బస్తాలు అందించినట్లు మండల వ్యవసా యాధికారి జి. రమేష్ తెలిపారు. తహసీల్దార్ విమలకుమారి, ఎస్‌ఐ యూ. గోవిందు పర్యవేక్షించారు. మొత్తం రెండు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు.
విజిలెన్స్ డీఎస్పీ పరిశీలన..
ఉంగుటూరులో యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో విజిలెన్స్ డీఎస్పీ బంగా ర్రాజు నేతృత్వంలో బృందం అక్కడికి చేరుకుని పంపిణీ వ్యవస్ధను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీని కలిసిన కౌలు రైతు సంఘం నాయకులు టీవీ లక్ష్మణస్వామి, అజ్మీరా వెంకటేశ్వరరావు తదితరులు రైతుల యూరియా ఇబ్బందులను వివరించారురు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.