
జనసేన కార్యకర్తల అతి
వైఎస్సార్ వర్ధంతి ఫ్లెక్సీపై జనసేన బ్యానర్ ఏర్పాటు అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అధికార కూటమికి సహకరించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన కార్యకర్తల నడుమ మంగళవారం వివాదం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కార్యకర్తలతో వైఎస్సార్ చిత్రపటం(ఫ్లెక్సీ)కు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన వేరే కార్యక్రమానికి బయలుదేరిన మరుక్షణం వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన జనసేక కార్యకర్తలను కొందరు వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ ఫణీంద్ర సిబ్బందితో చేరుకున్నారు. దగ్గరుండి వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందించారు. కూటమి నేతలు, పోలీసుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. పవన్ కార్యక్రమం ముందు జరిగి ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని పోలీసులు చెప్పేవారని చర్చించుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు.