
యోగా ఆరోగ్య ప్రదాయిని
కోనేరుసెంటర్(మచిలీపట్నం): యోగా సాధన వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం యోగా ద్వారా వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా ఆరోగ్య ప్రదాయిని అని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యంగా యువత యోగా సాధన చేయడం వల్ల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి యోగాలో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వికసిత భారత్ 2047 నోడల్ అధికారి డాక్టర్ ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం. వి.బసవేశ్వరరావు, యోగా గురువు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులతో యోగాసనాలు చేయించారు.