చౌకబారు మాఫియా.. | - | Sakshi
Sakshi News home page

చౌకబారు మాఫియా..

Aug 8 2025 7:11 AM | Updated on Aug 8 2025 7:11 AM

చౌకబా

చౌకబారు మాఫియా..

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అధికార పార్టీ నేతలే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పార్లమెంట్‌ ముఖ్యనేత డైరెక్షన్‌లో అధికారుల కనుసన్నల్లో బియ్యం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పార్లమెంటు ముఖ్యనేత, ప్రజాప్రతినిధులు మెక్కేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్‌ అధికారులను పావులుగా మార్చుకొని రేషన్‌ డీలర్లపై ప్రయోగిస్తున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్‌ మేరకు వారు చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా ఒకటో తేదీనే చాలా రేషన్‌ దుకాణాల్లో బియ్యం సంచులు ఖాళీ అయి పోతున్నాయి.

నియోజకవర్గానికి సగటున 500 టన్నులకు పైగా బియ్యం మాఫియా చేతుల్లోకి

జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్‌ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్‌ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్‌ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. ప్రతి నెలా బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజక వర్గాల ప్రజాప్రతి నిధులు రూ.25 లక్షల చొప్పున దండుకున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న బియ్యం లీలలు ఇవి.

విష ప్రచారం చేసి..

గత ప్రభుత్వం మొబైల్‌ వాహనాల్లో ఇంటింటికీ రేషన్‌ ఇచ్చిది. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ నాడు కూటమి విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు. రేషన్‌ దుకాణాలకు ప్రతి నెలా 26వ తేదీ బియ్యం సరఫరా చేస్తారు. 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాల్సింటుంది. అయితే రేషన్‌ దుకాణాలు తెరిచిన రెండు, మూడు రోజులలోపే బియ్యం ఉండటం ల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు పౌర సరఫరాలు, విజిలెన్స్‌ అధికారులతో రేషన్‌ డీలర్లపై ఒత్తిడి తెచ్చి, వారు సూచించిన రేషన్‌ మాఫియా సభ్యులకే బియ్యం ఇచ్చేలా హుకుం జారీ చేస్తున్నారు. రేషన్‌ మాఫియా.. రేషన్‌ డీలర్లకు ముందే అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దందాకు సహకరించని డీలర్లపై రేషన్‌ షాపులు తనిఖీ చేసి, సీజ్‌ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని దందాకు సహకరిస్తున్నారని తెలుస్తోంది.

వ్యవస్థీకృతమైన రేషన్‌ బియ్యం మాఫియా ప్రతి నెల 26న డీలర్లకు బియ్యం సరఫరా పావులుగా మారిన అధికారులు! ప్రతి నియోజకవర్గం నుంచి 500 టన్నులు.. బియ్యం మాఫియా చేతిలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు..

పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్‌...అధికారుల యాక్షన్‌...!

సూరంపల్లిలో డంప్‌!

పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలో రేషన్‌ దందా జరుగుతోంది. ఈ దందా అంతా రామచంద్రరావు అనే వ్యక్తి నడిపిస్తున్నారు. ఇతను పార్ల మెంటు ముఖ్యనేతకు నెలవారీగా దాదాపు కోటి రూపాయలకుపైగా ముడుపులు ఇస్తూ దర్జాగా దందా చేస్తున్నారు. జగ్గయ్యపేటలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి, నందిగామలో కంచికచర్లకు చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గ ప్రజాప్రతినిధి అనుచరులు, పెనమలూరులో క్రాంతి కిరణ్‌, గుడివాడలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి పేరుతో గిరి అనే వ్యక్తి రేషన్‌ బియ్యం అక్రమ దందాలో పలు పంచుకొంటున్నారు. ఈ బియ్యాన్ని పామర్రుకు చెందిన మాఫియా డాన్‌ గొట్టపు రమేష్‌ సేకరిస్తున్నారు. ఆయన గన్న వరం సమీపంలోని సూరంపల్లి వద్ద డంపు చేసి, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఇటీవల ఈ డంపుపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా జిల్లా పౌర సరఫరాల ఉన్నతాధికారికి, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో ఆయన చేతులెత్తేసినట్లు చర్చ సాగుతోంది. కొంత బియ్యం ఇబ్రహీపట్నం పంట పొలాల్లో లోడ్‌ చేసి, పోర్టుకు పంపుతున్నారు. రేషన్‌ మాఫియా దందాకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌పై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి.

చౌకబారు మాఫియా..1
1/2

చౌకబారు మాఫియా..

చౌకబారు మాఫియా..2
2/2

చౌకబారు మాఫియా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement