
నేడు వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, వరలక్ష్మీదేవి అలంకారం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆది దంపతులతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాలధారణ జరుగుతుంది. అనంతరం ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని ఏకాంత సేవగా చేస్తారు.
నేటి నుంచి పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వరలక్ష్మీదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై మూడు రోజులు పవిత్రోత్సవాలు ఉదయం 9.30 గంటల తర్వాతే అమ్మవారి దర్శనం