
కార్తికేయుని సన్నిధిలో విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని విజిలెన్స్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఎల్.వి.రమణమూర్తి దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం పుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించారు. అర్చకులు బుద్దు సతీష్ శర్మ, మణికుమార్‌శర్మ స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రమణమూర్తికి ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఈ నెల 24వ తేదీన జరిగే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టులో జరుగుతున్న భద్రతా ఏర్పా ట్లను అధికారులు మంగళవారం పరిశీలించారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ నేతృత్వంలో అధికారుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించింది. గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గీతాంజలిశర్మ ఆదేశించారు. గవర్నర్ పర్యటించే విజయవాడ నుంచి ఆత్కూరు వరకు రహదారి మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి సారించా లని సూచించారు. ఏఎస్పీ సత్యనారాయణ, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా పీ4 అమలు
నందిగామరూరల్: పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ–4 విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని కేతవీరునిపాడులో నిర్వహిస్తున్న పీ–4 ఇంటింటి సర్వే తీరును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారన్నారు. జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించగా 3,669 మంది మార్గదర్శకులుగా ముందుకొచ్చి 28,992 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోవటం, బ్యాంకు ఖాతా, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, తదితర వివరాల ఆధారంగా జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేద శిక్షణకు
దరఖాస్తులు ఆహ్వానం
ఘంటసాల: మండలంలోని తాడేపల్లి గ్రామంలోని శ్రీ మలయాళస్వామి పెద్దాశ్రమంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలలో శిక్షణకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆశ్రమం కన్వీనర్ కావూరి కోదండ రామయ్య తెలిపారు. ఆశ్రమం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం, తిరుపతిలోని జాతీయ సంస్కృత కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలలో రెండేళ్ల ప్రాక్ శాస్త్రి (ఎంటీసీ) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, భారతీయ సనాతన ధర్మాన్ని విశ్వసించే అన్ని కులాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కోర్సులో గణితం, సంప్రదాయ శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు ఉంటాయని, రెండేళ్ల శిక్షణ సమయంలో విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలను యాజమాన్యమే కల్పిస్తుందని తెలిపారు. ఆసక్తిగల అర్హులు ఈ నెలాఖరులోపు దరఖాస్తులు సమ ర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు 70756 65766 సెల్ నంబరులో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో మొవ్వ శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కార్తికేయుని సన్నిధిలో విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్