కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jul 16 2025 4:15 AM | Updated on Jul 16 2025 4:15 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025
u8లో

మున్సిపల్‌ కార్మికుల అరెస్ట్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): తమ డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికులు విజయవాడలో మంగళవారం ధర్నా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 556.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 64,789 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

కొనసాగుతున్న ఆషాఢ సంబరం

దుర్గగుడిలో ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రసాదాల పోటు సిబ్బంది, కేశఖండనశాల నాయీ బ్రాహ్మణులు అమ్మ వారికి సారె సమర్పించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురైన ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకు మొదటిగా గుర్తుకొచ్చేది విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌). ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తారు. ఆయా జిల్లాల ఆస్పత్రుల నుంచి ముఖ్యమైన కేసులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికే అక్కడి వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర సీరియస్‌ కేసులను జీజీహెచ్‌కే తరలిస్తున్నారు. ఇంతటి ముఖ్యమైన ఆస్పత్రిలో పాలన గాడి తప్పింది. అధికారులు ఏసీ గదులకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులు ఏమైతే తమకేంటి అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి మృతి చెందితే వారి బంధువులు మహాప్రస్థానం వాహనం కోసం అధికారుల చుట్టూ తిరిగి బతిమలాడాల్సిన దయనీయ స్థితి నెలకొంది. రోగుల సేవలను పట్టించు కోరుగాని కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లు దండు కోవడంలో శ్రద్ధ చూపుతారనే విమర్శలు ఉన్నాయి.

రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆస్పత్రిలో రోగి ఎవరైనా మృతి చెందితే మహాప్రస్థానంలో తరలించాలంటే ఆర్‌ఎంఓ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తాస్పత్రిలో మహాప్రస్థానం వాహనాలు చూసే ఆర్‌ఎంఓలు ఫోన్‌లకు స్పందించరనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగి మృతి చెందిన తర్వాత నాలుగైదు గంటలు మృతదేహం ఆస్పత్రిలోనే ఉన్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక్కోసారి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఫోన్‌ ఎత్తినా, మహాప్రస్థానం చూసే డెప్యూటీ ఆర్‌ఎంఓ ఫోన్‌ ఎత్తడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు జరిగినా ‘మేమింతే.. మారేది లేదంతే... అనే రీతిలో డెప్యూటీ ఆర్‌ఎంఓ వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవడంలో ఆర్‌ఎంఓ వ్యవస్థ కీలకం. ప్రభుత్వాస్పత్రిలో ఆ వ్యవస్థ నిర్వీర్యమైంది. సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ పాత ఆస్పత్రికి వెళ్లడంతో, కొత్త ఆస్ప త్రిలో పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించే డెప్యూటీ ఆర్‌ఎంఓ ఏసీ గది దాటి బయటకు రావడం లేదని రోగులు, వారి బంధువులు విమర్శిస్తున్నారు. భారమంతా అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌లు, ఏఆర్‌ఎంఓలపై పడుతోంది. వారి మాట టీచింగ్‌ వైద్యులు వినడంలేదు. సీఎస్‌ ఆర్‌ఎంఓ ఉంటే ప్రొఫెసర్లకూ ఆదేశాలు ఇవ్వొ చ్చని పేర్కొంటు న్నారు. జూనియర్లను ఏఆర్‌ఎంఓలుగా నియమించడంతో వారిని ఎవరూ లెక్కచేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

రక్త పరీక్షలకు రోగుల తిప్పలు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ

7

న్యూస్‌రీల్‌

జీజీహెచ్‌లో అడ్మినిస్ట్రేషన్‌ అస్తవ్యస్తం ఆర్‌ఎంఓ వ్యవస్థ నిర్వీర్యం రోగుల కష్టాలు పట్టించుకునే నాథుడేడీ? సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లపైనే భారం చుక్కాని లేని నావలా మారిన పరిస్థితి

మామూళ్లపైనే దృష్టి

నిబంధనలు గాలికి..

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. రోగులకు అందాల్సిన సేవలు, సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన ఆర్‌ఎంఓ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. రోగుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడు. మేమింతే.. మా తీరింతే.. మేము మారమంతే.. అనే విధంగా కొత్తాస్పత్రిలోని అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మృతదేహాన్ని తరలించాలంటే చచ్చేచావు

రోగుల సేవలను పర్యవేక్షించడంలో అలసత్వంగా వ్యవహరించే అధికా రులు మామూళ్లపై మాత్రం దృష్టి సారిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రిలో లేని రక్తపరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌లో చేయించాలి. ఆ ల్యాబ్‌కు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ చెల్లిస్తుంటారు. ఆ పరీక్షలను పర్యవేక్షించే అధికారికి మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇతర కాంట్రాక్టర్‌ల నుంచి దండుకుంటున్నట్లు చెబుతున్నారు. మామూళ్లు వచ్చే పనిపై ఉన్న శ్రద్ధ రోగుల సేవలపై చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఓపీకి నిత్యం 2500 నుంచి 2800 మంది వరకు రోగులు వస్తారు. వారిలో 800 నుంచి 1100 మందిని వైద్యులు రక్తపరీక్షలకు పంపిస్తారు. నిత్యం 300 మందికి ఆల్ట్రా స్కానింగ్‌లు, 300 మంది వరకూ ఎక్స్‌రేలు తీస్తారు. అయితే రోగులకు అందాల్సిన సేవలను పర్యవేక్షించాల్సిన ఆర్‌ఎంఓ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. డయాగ్నొస్టిక్‌ బ్లాక్‌లో రక్త పరీక్షలు చేయించుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించాలి. ఆ రిజిస్ట్రేషన్‌ కోసం గంటకు పైగా క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కోసం వెళితే మధ్యాహ్నం 12 గంటలు దాటితే, మరుసటి రోజు రావాలని చెబుతున్నారు. డయాగ్నొస్టిక్‌ బ్లాక్‌ పర్యవేక్షించే అధికారి అటువైపు కన్నెత్తి కూడా చూడరు. రక్తపరీక్ష శాంపిల్స్‌ ఉదయం 9 గంటలకు తీసుకుంటే, రిపోర్టులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఇస్తారు. రిపోర్టులు తీసుకున్న తర్వాత వైద్యులు ఉండరు. మళ్లీ మరుసటి రోజు ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. డయాగ్నొస్టిక్‌ బ్లాక్‌లో రక్తపరీక్షలు చేయించుకోవాలన్నా, ఎక్స్‌రే తీయించుకోవాలన్నా క్యూలైన్‌లో కుస్తీ తప్పదు. కొన్ని సందర్భాల్లో కిట్‌లు లేక సీరమ్‌ క్రియాటిన్‌ వంటి పరీక్షలను సైతం బయట చేయించాల్సిన దుస్థితి నెలకొంది.

కృష్ణాజిల్లా1
1/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/8

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/8

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement