434 మంది సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

434 మంది సర్టిఫికెట్ల పరిశీలన

Jul 16 2025 4:15 AM | Updated on Jul 16 2025 4:15 AM

434 మ

434 మంది సర్టిఫికెట్ల పరిశీలన

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్‌–2025 (ఎంపీసీ స్ట్రీం)లో ర్యాంక్‌లు పొందిన స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోని హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ఈ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఎన్‌సీసీ–162, సీఏపీ– 160, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌–112 మంది చొప్పున 434 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.విజయసారథి తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సీఏపీ కేటగిరీ అభ్యర్థులకు 1,50,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు, విభిన్న ప్రతిభావంతులు, ఆంగ్లో ఇండియన్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కేటగిరి అభ్యర్థుల మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామన్నారు.

20న ‘ప్రణామం’

కవి సమ్మేళనం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20న విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం నందు ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు కలిమిశ్రీ తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ చేతుల మీదుగా కవి సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ, ఒక తపస్సుతో కవిత్వం రాస్తున్న కవుల సమ్మేళనానికి తప్పకుండా వస్తానన్నారు. కలిమి శ్రీ మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొని భాష, సామాజిక స్పృహ, దేశభక్తి, ప్రపంచశాంతి, పర్యావరణం అంశాలపై తమ కవితలను వినిపించొచ్చని సూచించారు. పాల్గొన్న కవులందరికీ ప్రశంసాపత్రం, బుక్‌ ఆఫ్‌ భారత్‌ రికార్డ్స్‌ చిరు జ్ఞాపికలు అందజేస్తామని మల్లెతీగ ఉపాధ్యక్షుడు చొప్పా రాఘవేంద్రశేఖర్‌ తెలిపారు. వివరాలకు 92464 15150 నంబరులో సంప్రదించాలని కోరారు.

రేపటి నుంచి కార్తికేయుని పవిత్రోత్సవాలు

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా శాంతి కల్యాణం, రుద్రాభిషే కాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొన్నారు. 20వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి శాంతి కల్యాణం జరుగుతుందని తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మనక్షత్రం ఆఢికృత్తిక సందర్భంగా ఈ నెల 20వ తేదీన వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకాలు, శాకంబరీ అలంకరణ జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు.

పాఠశాలల అభ్యున్నతిలో భాగస్వాములు కావాలి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పాఠశాలల అభ్యున్నతిలో ప్రధానోపాధ్యాయులు భాగస్వాములు కావాలని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధి కారి యు.వి.సుబ్బారావు సూచించారు. స్టెల్లా కాలేజీలో జిల్లాలోని మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ హెచ్‌ఎంలకు మంగళవారం నాయకత్వ లక్షణాలపై శిక్షణ శిబిరం ప్రారంభించారు. డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ.. నూతన మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ను ప్రభుత్వ ఆలోచలనకు అను గుణంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ పాఠశాలలను అన్నింటికన్నా మిన్నగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నిపుణులు ప్రసంగించారు.

434 మంది సర్టిఫికెట్ల పరిశీలన1
1/1

434 మంది సర్టిఫికెట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement