
న్యాయ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
పెనమలూరు: న్యాయ విద్యార్థులు వృత్తిలో రాణించాలంటే కళాశాల దశ నుంచే నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్.కె.కృపాసాగర్ సూచించారు. కానూరులోని సిద్ధార్థ లా కాలేజీలో సోమవారం చట్టపరమైన, న్యాయపరమైన వృత్తిపై స్వీయ పరిశీలన అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత విద్యార్థులు భవిష్యత్తుపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా వృత్తి నైపుణ్యాన్ని సమకూర్చుకోవాలని స్పష్టంచేశారు. న్యాయవాద వృత్తిలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని నైపుణ్యం కోసం అన్వేషించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నుపాటి దివాకర్‌బాబు, అధ్యాపకులు, పలువురు పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
జస్టిస్ కృపాసాగర్