
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
హాస్టళ్లలో తనిఖీలు
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాపరెడ్డి బుధవారం గన్నవరం మండలం, గుడివాడలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
పూల మార్కెట్ కిటకిట
విజయవాడలోని రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ కొనుగోలుదారులతో బుధవారం కళకళ లాడింది. శ్రావణ మాస ప్రత్యేక పూజల నేపథ్యంలో పూల కోసం బారులు తీరారు.
ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు
తిరువూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని ప్రజాప్రతి నిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీసీహెచ్‌ఎస్ మాధవీదేవి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు.
u8లో
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ భూములు, ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలే విలువైన ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఘటన. మచిలీపట్నంలోని మాచవరంలో రూ.54 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
ప్రభుత్వ కార్యాలయం నిర్మాణంలో ఉన్నా..
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాచవరం రెవెన్యూ పరిధిలో ఆర్‌ఎస్ నంబర్ 258/4లో 1.60సెంట్ల భూమి ఉంది. అక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ.70వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన 77.44 గజాల భూమి విలువ రూ.54 కోట్లు. మార్కెట్ యార్డు రోడ్డులో ఉన్న అత్యంత ప్రాధాన్యం గలిగిన ఈ భూమిని ఇప్పటికే రవాణా శాఖకు కేటాయించారు. ఆ స్థలంలో ఆ శాఖకు చెందిన అధికారులు రెండు, మూడు దఫాలుగా రూ.1.5కోట్ల విలువైన పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టు ఇచ్చి నిర్మాణాలు చేయించారు. ఈ స్థలంలో కొంతమేర నిర్మాణ పనుల పర్యవేక్షణను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలు చేపట్టాయి. ఆ పనులకు సుమారు రూ.50లక్షలకు పైగా వ్యయం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాంటి స్థల రికార్డులను రెవెన్యూ అధికారులు ఏమార్చి.. అది ప్రభుత్వ ఖాళీ స్థలం అని, ఎవరి అనుభవంలోనూ లేనట్లు తప్పుగా చూపించి.. ధారాదత్తం చేసేందుకు అంతా సిద్ధం చేశారు.
అసలేం జరిగిందంటే..
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి తొలుత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భూమిని కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. దానికి రెవెన్యూ శాఖ అభ్యంతరం చెప్పడంతో, మాచవరంలో రెవెన్యూ పరిధిలోని మార్కెట్ యార్డు రోడ్డులో ఉన్న అత్యంత విలువైన భూమిపై టీడీపీ నేతల కన్ను పడింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని, అందులోనూ కార్యాలయాల నిర్మాణ పనులు జరుగుతున్న భూమిని ప్రైవేటు వారికి కేటాయించడం, నిబంధనలకు విరుద్ధం. అయినా సరే ఆ భూమిని తమ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కేటాయించాలంటూ, టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. అధికార పార్టీ కావడంతో ఉన్నత స్థాయి నేతలు చక్రం తిప్పడంతో ఆఫైలు ఆగమేఘాలపై కదిలింది.
టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రతిపాదించిన స్థలం ఇదే..
7
న్యూస్‌రీల్
ఎకరం రూ.1000 చొప్పున..
నిబంధనలకు నీళ్లు..
బందరులో ఆర్‌అండ్‌బీకి కేటాయించిన
భూమిపై ‘పచ్చ’నేతల కన్ను
ఏడాదికి రూ.1000చొప్పున,
33ఏళ్ల పాటు లీజుకు ప్రతిపాదన
ఆ భూమిలో ఇప్పటికే ఓ ప్రభుత్వ
కార్యాలయ నిర్మాణ పనులు
జరుగుతున్న వైనం
అయినప్పటికీ టీడీపీ దరఖాస్తుపై
ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధం
అధికార దుర్వినియోగంపై
విస్తుపోతున్న ప్రజా సంఘాలు
టీడీపీ నేతలు అత్యంత విలువైన స్థలాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి ఎకరానికి నామమాత్ర ధర రూ.1000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 33 ఏళ్ల లీజుకు కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను మచిలీపట్నం వాసులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్పొరేషన్ పాలక వర్గంలోని సభ్యులు సైతం, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలం, ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇవ్వటం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఏదైనా భూమిని ప్రైవేటు వారికి కేటాయించాలంటే, 15 రోజుల ముందుగా బహిరంగ ప్రకటన చేయాలి. గ్రామ సభ నిర్వహించి ప్రజల అభ్యంతరాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. కానీ టీడీపీ కార్యాలయం కోసం భూమిని కేటాయించాలని చేసిన దరఖాస్తును ప్రతిపాదిస్తూ, అట్టి ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను, స్వీకరణకు ఏ1 నోటీసులోని తేదీలను, నెలను స్పష్టత లేకుండా, ప్రజలకు అర్థంకాని రీతిలో తయారు చేసి, దానిని స్థానిక మూడో వార్డులో ఉన్న నోటీసు బోర్డులో అతికించారు. దీనిని సైతం ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ముందు రోజు జూలై 31వ తేదీన మూడో వార్డు సచివాలయంలో నోటీసు బోర్డులో కనీసం తేదీ కూడా కనిపించకుండా అతికించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే తహసీల్దార్‌కు పలు ప్రజా సంఘాలు వినతి పత్రాలు ఇచ్చాయి. దీంతోపాటు ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలు జరుగుతున్న భూమిని టీడీపీ కార్యాలయాలకు ఎలా కేటాయిస్తారని ఆర్‌డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు వినతి పత్రాలు పంపాయి. ఇదే అంశంపై కలెక్టర్‌ను కలిసి తమ అభ్యంతరాలు చెప్పేందుకు ప్రజా సంఘాలు సిద్ధం అయ్యాయి. కానీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.54 కోట్ల విలువైన భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా