
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడె
కోనేరుసెంటర్(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా పలువురిని నియమించారు. అందులో భాగంగా పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)ని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేర్ని కిట్టు నియామకం పట్ల మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.