తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు | - | Sakshi
Sakshi News home page

తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

Jul 10 2025 8:18 AM | Updated on Jul 10 2025 8:18 AM

తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

తల్లి చెంతకు చేరిన తప్పిపోయిన బాలుడు

గన్నవరం: స్థానిక విమానాశ్రయంలో తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు తల్లి చెంతకు చేరాడు. ఈ మేరకు ఆ బాలుడిని అతడి తల్లి ప్రసన్నకు గన్నవరం పోలీసులు అప్పగించారు. విమానాశ్రయంలోకి తప్పిపోయి వచ్చిన బాలుడిని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ బాలుడి గురించి సామాజిక మాధ్యమల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది. నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన ప్రసన్న భర్త శివకృష్ణతో నెలకొన్న విభేదాల కారణంగా ఏడేళ్ల కుమారుడు అనిల్‌కుమార్‌తో పాటు గన్నవరం వచ్చి ఓ ఆశ్రమంలో వంట పని చేస్తోంది. ఈ నేపథ్యంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన అనిల్‌కుమార్‌ విమానాశ్రయంలోకి వెళ్లి తప్పిపోయాడు. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న తల్లి ప్రసన్న చెంతకు ఆ బాలుడు చేరడంతో కథ సుఖాంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement