
పేదల సంక్షేమానికి పీ–4
చిలకలపూడి(మచిలీపట్నం): పేదల సంక్షేమాభి వృద్ధికి పీ–4 విధానం దోహదపడుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి పీ–4 కార్యక్రమ అమలుపై ప్రజాప్రతినిధులు, ఔత్సాహికులు, అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. మెరుగైన సమాజ నిర్మాణం కోసం పీ–4 కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు రూపకల్పన చేశారన్నారు. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వ్యక్తుల సహకారంతో పేదల కుటుంబాలను పైకి తీసుకురావాలనేదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 9,778 బంగారు కుటుంబాలు గుర్తించామని అందులో 398 కుటుంబాలను 106 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని పేదరికాన్ని జీరో స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారికి ఆర్థిక సాయం, వస్తు సేవల రూపంలో చేయూత అందిస్తామ న్నారు. పిల్లల చదువుల ఖర్చు భరిస్తారన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆర్సీ ఆనందకుమార్, మచిలీపట్నం నియోజకవర్గ ప్రత్యేకాధి కారి ఎల్.నిత్యానందం, మండల ప్రత్యేకాధికారి శివరామప్రసాద్, మునిసిపల్ కమిషనర్ బాపి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర