
మహిళా శిశుసంక్షేమ శాఖ ఇగ్నైట్ సెల్ ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ః 2047 దార్శనిక ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను మంగళవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అధికారులు తెలిపారు. ప్రీ స్కూల్, బాల అలెర్ట్, బాల సంజీవిని కిట్, గ్రోత్ మానిట రింగ్, గుడ్లు పాలు, టీహెచ్‌ఆర్, పోషణ వాటిక తదితర కార్యక్రమాల గురించి వివరించారు. వన్ స్టాప్ సెంటర్, దత్తత, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలు భానుమతి, జ్యోత్స్న, డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, దుర్గా భవాని, జాన్సన్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు డాగ్ కెనాల్స్ నిర్మాణానికి భూమిపూజ
పటమట(విజయవాడతూర్పు): పోలీస్ కమిషనరేట్‌లో మరో రెండు డాగ్ కెనాల్స్ (గదులు) నిర్మించడానికి పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖరబాబు మంగళవారం భూమి పూజ చేశారు. సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్ సమీపంలోని డాగ్స్ కెనాల్ వద్ద ఆగస్టులో శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న రెండు జాగిలాల కోసం అదనంగా మరో రెండు డాగ్ కెనాల్స్ నిర్మించడానికి భూమి పూజ చేశారు. సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ.. పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రముఖులు, వీవీఐపీలు, ముఖ్యలు విచ్చేసే సమయంలో వారి భద్రత, వివిధ బందోబస్తు, నార్కోటిక్స్, నేర పరిశోధనల సమయాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా శిక్షణ ఇచ్చిన జాగిలాలను ఉపయోగిస్తామన్నారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, డీసీపీ ఏబీటీఎస్ ఉదయ రాణి, సీఎస్‌డబ్ల్యూ ఎస్‌వీడీ ప్రసాద్, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, ఏసీపీ కృష్ణంరాజు, ఏసీపీ ప్రేమ్ కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విమానాశ్రయంలో తప్పిపోయిన బాలుడు
విమానాశ్రయం(గన్నవరం): స్థానిక విమానాశ్రయంలో ఓ బాలుడు తప్పిపోయాడు. ఆ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు మంగళవారం ఎయిర్‌పోర్ట్ అధికారులు గన్నవరం పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతంలో తప్పిపోయి ఏడుస్తున్న ఓ బాలుడిని ఎయిర్‌పోర్ట్‌లో భద్రత సిబ్బంది గుర్తించారు. తన పేరు అనిల్‌కుమార్, తండ్రి మెకానిక్ శివ, తల్లి ప్రసన్న, తాము ఉండేది విజయవాడ అన్న వివరాలు మాత్రమే చెబుతున్నాడు. విజయవాడలో ఏ ప్రాంతంలో నివసించేదీ చెప్పలేకపోయాడు. విమానాశ్రయ అధికారులు ఆ బాలుడిని గన్నవరం పోలీసు లకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాలుడు తమ సంరక్షణలో ఉన్నాడని ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు. ఆ బాలుడికి సంబంధించిన వ్యక్తులు 94406 27041, 94406 27042 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
‘నూటా’ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని వినతి
ఏఎన్‌యూ: నూటా (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపక సంఘం) ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నూటా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయా లని కోరుతూ ఎన్నికల అధికారి ఆచార్య ఎస్. మురళీమోహన్‌కు మంగళవారం వారు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియలోని లోపాలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తమ పిటీషన్‌పై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు నూటా ఎన్నికల కోసం ఈ నెల ఒకటో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయా లని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

మహిళా శిశుసంక్షేమ శాఖ ఇగ్నైట్ సెల్ ప్రారంభం

మహిళా శిశుసంక్షేమ శాఖ ఇగ్నైట్ సెల్ ప్రారంభం

మహిళా శిశుసంక్షేమ శాఖ ఇగ్నైట్ సెల్ ప్రారంభం