నీరాజనం | - | Sakshi
Sakshi News home page

నీరాజనం

Jul 9 2025 6:26 AM | Updated on Jul 9 2025 6:26 AM

నీరాజ

నీరాజనం

మహానేతకు
మనసున్న మారాజు.. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని జిల్లా ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని మంగళవారం వాడవాడలా మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఆయన పాలనలో లబ్ధిపొందిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో మంగళవారం ఘనంగా జరిగాయి. వాడవాడలా ఉన్న వైఎస్‌ విగ్రహాలకు వైఎస్సార్‌ సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకులు కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తమకున్న స్మృతులను నెమరు వేసు కున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. పలుచోట్ల పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంచిపెట్టారు. పేదలకు అన్నసంతర్పణ నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్త దానం చేశారు.

● మచిలీపట్నం నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి మాజీ మంత్రి పేర్ని నాని, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కిట్టు, పెనమ లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని నాగపోతరావు సెంటరులో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాచవరపు రాంప్రసాద్‌, పార్టీ నాయకులు జవ్వాది రాంబాబు, ఎగ్గోని గాంధీ తదితరులు పాల్గొన్నారు.

● గుడివాడ వైఎస్సార్‌ సీపీలో ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని స్థానిక రాజేంద్రనగర్‌ లోని మాజీ మంత్రి కొడాలి నాని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మట్టా జాన్‌విక్టర్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, నందివాడ ఎంపీపీ పేయ్యల ఆదాం తదితరులు పాల్గొన్నారు. మెరుగుమాల కాళీ ఆధ్వర్యంలో డాక్టర్‌ వైఎస్సార్‌ జయంతి వేడుకలు జరిగాయి. తొలుత భారీ బైక్‌ ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

● అవనిగడ్డ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ పంచారు. ఆదర్శ రైతులకు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, యువ నాయకుడు సింహాద్రి వికాస్‌ పట్టు వస్త్రాలు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి స్థానిక వంతెన సెంటర్‌కు ర్యాలీగా వచ్చి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు

● మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పెనమలూరు నియోజకవర్గం అంతటా ఘనంగా జరిగాయి. కంకిపాడులో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి జెడ్పీటీసీ బాకీ బాబు, మండల అధ్యక్షురాలు మాదు శ్రీహరిరాణితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కానూరు వృద్ధుల ఆశ్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) వితరణతో వృద్ధుల అన్న సంతర్పణ చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌ జయంతి ఘనంగా నిర్వహించారు.

● గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగు టూరు, బాపులపాడు, విజయవాడ రూరల్‌ మండలాల్లో గ్రామ గ్రామాన వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాలు జరిగాయి. పలు చోట్ల అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

● పెడన నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మచిలీపట్నం రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద వైఎస్సార్‌ భారీ విగ్రహానికి, 16వ వార్డు, బంటు మిల్లి రోడ్డు, జయలక్ష్మి పీఎసీఎస్‌ తోటమాల సెంటర్లలోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బంటుమిల్లిలో పేదలకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

● పామర్రులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి అశోక్‌ కుమార్‌, కొనుపెల్లి స్వరూపరాణి, కాకర్ల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వాడవాడలా ఘనంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు రాజన్న విగ్రహాల వద్ద నివాళులర్పించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ చేసిన నాయకులు

నీరాజనం1
1/3

నీరాజనం

నీరాజనం2
2/3

నీరాజనం

నీరాజనం3
3/3

నీరాజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement