సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు.


