
ట్రాఫిక్‌తో టెన్షన్.. టెన్షన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గజిబిజి ట్రాఫిక్‌తో రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా నడిపే వాహనాలతో ట్రాఫిక్‌లో పద్ధతిగా వెళ్లేవారికి వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యం ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల్ని పరీక్షలకు తీసుకెళ్లడం, ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో సమయానికి వెళ్లలేమని టెన్షన్ పడుతుంటారు.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు...
● పెనమలూరుకు చెందిన రాజేష్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ఆఫీసులో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ అమలులో ఉంది. పది నిమిషాలు ఆలస్యమైతే, మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేస్తుండటంతో తీవ్రమైన టెన్షన్ నెలకొంటుంది. ట్రాఫిక్‌లో ప్రయాణిస్తూ తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు.
● గాంధీనగర్‌కు చెందిన ఉద్యోగి గన్నవరంలో పనిచేస్తుంటారు. ప్రతిరోజూ తమ కుమార్తెను బెంజిసర్కిల్ వద్ద కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్తుంటారు. ఇలా ప్రతిరోజూ కళాశాలకు, కార్యాలయానికి సమయానికి వెళ్లలేమనే టెన్షన్‌కు గురవుతూ, నలభై ఏళ్ల వయస్సులోనే హైపర్‌టెన్షన్ బారిన పడ్డారు.
ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్‌తో అనేకమంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఏమి చేయాలి...
● మనం వెళ్లే ప్రాంతం దగ్గరలో ఉన్న సమయానికి కంటే కొద్దిగా ముందుగా బయలు దేరాలి. అప్పుడు ట్రాఫిక్ ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
● నిత్యం ప్రయాణించే వారు యోగా, మెడిటేషన్ చేయాలి.
● కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
వైద్యులు గుర్తించిన సమస్యలివే...
ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు యాంగ్జయిటీకి గురవుతున్నారు.
యాంగ్జయిటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు.
నిత్యం ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసే వారికి కాలుష్యం కారణంగా రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడుపోటు వచ్చే అవకాశం ఉంది.
నిత్యం ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేసే వారు చిన్న వయస్సులోనే హైపర్‌టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది.
ట్రాఫిక్‌లో ప్రయాణంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి.
ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారిలో స్పైన్ సమస్యలు వస్తున్నాయి.
ట్రాఫిక్ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది.
ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌తో సమస్యలు
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణించడం వలన కాలుష్య ప్రభావానికి గురవుతుంటారు. ఫలితంగా రక్తం చిక్కపడి బ్రెయిన్‌స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా చికాకు, పనిపై దృష్టిపెట్టలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీపీ, వెన్నెముక సమస్యలకు సైతం దారితీయొచ్చు.
–డాక్టర్ టీవీ మురళీకృష్ణ ,జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు
రద్దీ రోడ్లపై ప్రయాణంతో
మానసిక, శారీరక సమస్యలు
రక్తపోటు అధికం
అవుతుందంటున్న వైద్యులు
యాంగ్జయిటీ, నిద్ర సమస్యలు ఎక్కువే
కాలుష్యంతో రక్తం చిక్కపడి
స్ట్రోక్‌కు దారితీయొచ్చు
విపరీతంగా పెరిగిపోయిన
వ్యక్తిగత వాహనాలు
యాంగ్జయిటీకి గురవుతారు
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. దీనివలన చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. హైపర్‌టెన్షన్ బారిన పడతారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించడం మేలు.
–డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్

ట్రాఫిక్‌తో టెన్షన్.. టెన్షన్

ట్రాఫిక్‌తో టెన్షన్.. టెన్షన్