
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
విస్సన్నపేట: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవరుపై శుక్రవారం రాత్రి పుట్రేల శివారు జానలగడ్డలో ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ పీఎస్ విష్ణు, జానలగడ్డ నుంచి ప్రజలను అమరావతిలో జరిగిన కార్యక్రమానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా రామానగరానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి బస్సు ఆపారు. డ్రైవర్‌ను దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డ్రైవరు విష్ణుకు తీవ్ర గాయాలు కాగా విస్సన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం అతన్ని విజయవాడ తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.