గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గూడవల్లి మండల ప్రాథమికోన్నత పాఠశాల ఇంగ్లిషు స్కూల్ అసిస్టెంట్ జి.రవికుమార్‌కు డీఈవో సీవీ రేణుక షోకాజ్ నోటీసు జారీ చేశారు. విద్య, వైద్య శాఖలు సంయుక్తంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రక్తహీనత నివారణ చర్యలు, మాత్రల పంపిణీపై శుక్రవారం ఆన్‌లైన్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. హాజరైన స్కూల్ అసిస్టెంట్ రవికుమార్ తన మొబైల్ ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టకుండా ఇతరులతో మాట్లాడుతూ సమావేశానికి అంతరాయం కలిగించారు. అనేక పర్యాయాలు మ్యూట్ చేయాలని, మాట్లాడవద్దని అధికారులు చెప్పినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీస సమాధానం చెప్పలేదు. పదే పదే అంతరాయం కల్పించిన రవికుమార్‌పై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో , ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయకూడదో వివరించాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు.