
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయవాడస్పోర్ట్స్: జిల్లా పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్స్ యూనిట్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందిన పి.శ్రీమన్నారాయణ కుటుంబానికి జిల్లాలోని హోంగార్డులు ఆర్థిక చేయూతనందించారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులందరూ వారి ఒక్క రోజు వేతనాన్ని సమకూర్చారు. రూ.5 లక్షల నగదు చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా శ్రీమన్నారాయణ భార్య పి.నరసమ్మకు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, హోంగార్డ్స్ ఆర్‌ఐ కె.సుధాకరరెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
గట్టుభీమవరం(వత్సవాయి): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో బస్సు జాతీయ రహదారిపై కొంగరమల్లయ్య గట్టు దాటాక సాయిబాబా గుడి సమీపంలో లారీని తప్పించబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. తరువాత చిన్నగా బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు తెలిపారు.

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత