పఠనాసక్తిని పెంపొందించాలి

వేమూరి బలరాంకు జాతీయ పురస్కారం            అందజేస్తున్న కలెక్టర్‌ ఢిల్లీరావు - Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

విజయవాడ కల్చరల్‌: పాఠకులలో పఠనాసక్తి కోసం సంపాదకులు కృషి చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు అన్నారు. జైనీ ఇంటర్‌ నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో వేమూరి బలరాం రచించిన ‘స్వాతి చిను కులు’ గ్రంథానికి లక్ష్మీనారాయణ జైనీ జాతీయ సాహి త్య పురస్కారం, అతడే ఒక సైన్యం బయోపిక్‌ సినిమా ప్రారంభ కార్యక్రమం గురువారం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ పాఠకుల అభిరుచులకు అనుగుణంగా పత్రికలను నిర్వహిస్తున్న బలరాం కృషిని అభినందించారు. నిర్వాహకుడు ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ సాహిత్య రంగంలో విశేష కృషి చేసి సమాజానికి సందేశం అందించే గ్రంథాలకు ఏటా పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు బలరాం లక్ష్మీనారాయణ సాహిత్య జాతీయ పురస్కారంతోపాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. బలరాం ఆ నగదును రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణకు విరాళంగా అందజేశారు. డెప్యూటీ కలెక్టర్‌ మారం రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధికారి చైతన్య జైనీ పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top