
మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో చేపట్టిన కోటి రుద్రాక్ష అభిషేకం బుధవారం ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకొని భక్తిశ్రద్ధలతో రుద్రాక్ష మాలలను సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో క్యూలైన్ ద్వారా భక్తులను దర్శనానికి పంపించారు. కోటి రుద్రాక్షలతో ఉన్న బాబావారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులందరికీ ఆలయకమిటీ అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం భక్తులకు రుద్రాక్షమాలలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పర్యవేక్షించారు.
కోటి రుద్రాక్ష మాలలతో షిర్డీ సాయినాధుడు