భవానీపురం(విజయవాడపశ్చిమ): శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెక్షన్ 144(2) సీఆర్‌పీసీ కింద కమిషనర్ టీకే రాణా నిషేధాజ్ఞలు విధించారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే నెల 20వ తేదీ వరకు 50 రోజులపాటు నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం, భవానీపురం, వన్‌టౌన్, కొత్తపేట, సత్యనారాయణపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, కృష్ణలంక, మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు లేదా అంతకు మించి ఎక్కువ మంది జనం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడ రాదని చెప్పారు.