జిల్లాలో గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో గాలివాన బీభత్సం

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

● కూలిన ఇళ్లు.. లేచిన పైకప్పులు ● రోడ్లకు అడ్డుగా విరిగిపడ్డ చెట్లు

కెరమెరి: మండలంలోని గోయగాం గ్రామపంచా యతీ పరిధి పిప్రి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన మడావి పావుగా, ఆత్రం పగ్గు ఇళ్లు స్వల్పంగా కూలిపోయా యి. ఇళ్ల పైకప్పులు పూర్తిగా లేచిపోయాయి. కు టుంబ సభ్యులంతా ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ సహకారంతో నిర్మించుకున్న రేకుల షెడ్లు కూలడంతో తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు తెలి పారు. ప్రభుత్వం తమకు ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మురళీధర్‌, సర్పంచ్‌ ఆనంద్‌రావు, ఉపసర్పంచ్‌ రాందాస్‌ గ్రామాన్ని సందర్శించి అధికారులకు నివేదిక అందించారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మునీర్‌ అహ్మద్‌ బాధితులను కలిసి వివరాలు తెలు సుకున్నారు. తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు తక్షణసాయం అందేలా చూస్తామని, ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చింతలమానెపల్లి మండలంలో..

చింతలమానెపల్లి: మండలంలో ఆదివారం తెల్ల వా రు జామున వర్షంతో పాటు వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. రుద్రాపూర్‌, బాబాసాగర్‌, ఖర్జెల్లి, దిందా, కేతిని, హేటిగూడ గ్రామాల్లో వీచిన గా లులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దిందా గ్రామంలో కోల తిరుపతి ఇంటి కప్పు ఎగిరిపోయింది. రుద్రాపూర్‌ గ్రామానికి చెందిన గుర్లె సంజీ వ్‌, హేటిగూడ గ్రామానికి చెందిన మండూరి తిరుపతి, నికాడి భీంరావు, కేతిని గ్రామానికి చెందిన సో యం నందారాం ఇళ్ల కప్పులు లేచిపోయాయి. ప లువురి పెంకుటిళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. ఖర్జెల్లి నుంచి గూడెం అటవీ ప్రాంతంలో పలు చెట్లు రోడ్డుకు అడ్డుగా చెట్లు పడిపోయాయి. కేతిని నుంచి దిందా మార్గంలో చెట్లు నేల కూలగా బీజేపీ నాయకుడు డోకె రామన్న ఆధ్వర్యంలో తొలగించారు.

బెజ్జూర్‌ మండలంలో..

మండలంలోని అందుగులగూడ, కుంటలమానెపల్లి, పోతెపల్లి, సుశ్మీర్‌, సలుగుపల్లి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. డబ్బా నుంచి బెజ్జూర్‌ మార్గంలో పలుచోట్ల చెట్లు రహదారిపై కూలిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగింది. కుంటలమానెపల్లి గ్రామంలో పలువురి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అందుగులగూడలో నలుగురి ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. పోతెపెల్లి గ్రామంలో వర్షం పడడంతో ఇంటి పైకప్పు సరిచేస్తుండగా డోకె సంజీవ్‌ పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement