ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్‌ అరెస్ట్‌

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయి తే, కలెక్టరేట్‌లో నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు ఆమె హాజరు కాగా, వెంట ఒక పోలీస్‌ వాహనం కూడా వెళ్లింది. కలెక్టరేట్‌ వద్ద కూడా భారీగా పోలీస్‌ సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతనిధిని అని, తనకు ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉందని చెప్పారు. పోలీసుల ను అడ్డుపెట్టుకుని తనను అక్రమంగా నిర్బంధించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అన్యాయమ ని మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement