నిలిచిన కర్జి–మొట్లగూడ రోడ్డు పనులు అటవీశాఖ అనుమతులు రానందునే.. ఎనిమిదేళ్లుగా కొనసా..గుతున్న వైనం గ్రామీణులకు తప్పని రవాణా కష్టాలు నీటి మూటలవుతున్న నేతల హామీలు !
దహెగాం: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన బీటీ రోడ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీశాఖ అడ్డుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. 2018లో పీఎంజీఎస్‌వై కింద మండలంలోని కర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్లు మంజూరు చేసింది. అప్పటి ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్లయినా పనులు పూర్తి కాని పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ప్రయాణ పాట్లు పడుతున్నారు.
అటవీశాఖ అనుమతి నిరాకరణ
కర్జి గ్రామం నుంచి మొట్లగూడ వయా రాంపూర్ గ్రామం వరకు సుమారు 12కిలో మీటర్ల మేర చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.6.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ, కర్జి నుంచి రాంపూర్ వరకు అటవీప్రాంతం ఉండడంతో అటవీ అధికారులు రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అప్పటి నుంచి రోడ్డు నిర్మా ణం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. రోడ్డు పనులు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ రవాణా కష్టాలు తొలగుతాయని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని వాపోతున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వానాకాలంలో నిలుస్తున్న బస్సులు
కర్జి నుంచి మొట్లగూడ వరకు మట్టి రోడ్డు ఉండడంతో వానాకాలంలో బురదగా మారుతోంది. దీంతో ఆర్టీసీ సేవలు వానాకాలం నాలుగు నెలలు నిలిచి ప్రజలు రవాణా కష్టాలు పడుతున్నారు. కర్జి గ్రామ సమీపంలోని ప్లాంటేషన్ వద్ద భారీ వర్షాలకు రోడ్డు కోతకు గురవుతోంది. దీంతో ఆటోలు కూడా వెళ్లలే ని పరిస్థితి నెలకొంటోది. కేవలం వేసవి, శీతాకాలా ల్లో మాత్రమే మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బ స్సు మొట్లగూడ వరకు వస్తుందని ఈ ప్రాంత ప్రజ లు చెబుతున్నారు. వానాకాలంలో ఇతర ప్రాంతాల కు రాకపోకలకు సాగించాలంటే ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో గర్భిణులను ప్రసవానికి తరలించడం ఇబ్బందిగా మారిన సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చి తరువాత విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు ఉన్నాయా.. లేదా.. వెనక్కి వె ళ్లాయా? అనే అనుమానం కలుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు ఇ ప్పించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల ని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు నిర్మాణానికి 2018లో వేసిన శిలాఫలకం


