ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో! | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కష్టాలు తీరేదెప్పుడో!

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

● రోడ్లపైనే చిరు వ్యాపారాలు ● పార్కింగ్‌కు స్థలాలు కరువు ● రహదారులపైనే వాహనాలు ● ఇబ్బందుల్లో పట్టణవాసులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఫుట్‌పాత్‌లపైనే వాహనాలు నిలుపుతున్నారు. చిరువ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డివిజన్‌ కేంద్రంగా ఉన్నపుడే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెట్టింపైంది. వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా స్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చిపోయే వాహనాల సంఖ్య పెరగడంతో రోడ్డు కు ఇరువైపులా పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. ఆటో స్టాండ్లకు అనువైన స్థలం లేక రోడ్డుపైనే నిలుపుతున్నారు. అసలే ఇరుకై న రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్‌పాత్‌ వ్యాపారాల కారణంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయా దుకాణాలకు సరుకులు సప్లయ్‌ చేసే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతుండడంతో సమస్య మరీ తీవ్రమైంది. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర కార్యాలయాలు, హోటళ్లు, ఆర్టీసీ డిపో, షాపింగ్‌ మాల్స్‌, ఇతర ప్రధాన దుకాణాలు దగ్గరదగ్గరగా ఉండడంతో వాహనాల పార్కింగ్‌కు స్థలం లేక ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. మేజర్‌ గ్రామపంచాయతీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో మున్సిపల్‌ నిబంధనల ప్రకారం రోడ్లు వెడల్పు చేయాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

రద్దీగా ప్రధాన కూడళ్లు

పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన అంబేడ్కర్‌చౌక్‌, వివేకానందచౌక్‌, జగ్జీవన్‌రామ్‌చౌక్‌, గాంధీచౌక్‌, పొట్టి శ్రీరాములుచౌక్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ప్రధాన కూడళ్లలో వ్యా పార, వాణిజ్య సముదాయాలు ఉండడంతో త ప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైనే వాహనాలు పార్కింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనాలు తరచూ ప్రమాదాలకు గురికా వాల్సి వస్తోందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నా రు. నూతనంగా ఇళ్లు నిర్మించుకునేవారు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్లను ఆక్రమించి ర్యాంపులు నిర్మించుకుంటున్నారు. అయినప్పటికీ అడ్డుకునేవారే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement