కెరమెరి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఆది వారం ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ, సన్ షైన్ హాస్పిటళ్ల సహకారంతో కెరమెరి పోలీసు ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబి రానికి హాజరై మాట్లాడారు. ముందుస్తు పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ప్రారంభ ద శలోనే గుర్తించవచ్చని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిరుపేద గ్రామీణులకు వైద్యశిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. పోలీ సులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటార ని, ఏ సమస్య వచ్చినా ‘డయల్ 100’ కాల్ చేసి తెలుపాలని సూచించారు. శిబిరానికి కెరమెరి ఆర్‌ఎంపీ, పీఎంపీలు పూర్తి సహకారమందించగా, సీఐ సత్యనారాయణ, కెరమెరి, వాంకిడి ఎస్సైలు మధూకర్, మహేందర్, ఇన్‌చార్జి జిల్లా ఫార్మసీ అధికారి కలీల్ హుస్సేని, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


