కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను, ఈఎస్‌ఐ ఆస్పత్రి భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ హరిత ఆదివారం పరిశీలించారు. సమీపంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంజేశారు. చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రి య విద్యాలయం ఏర్పాటుకు కాగజ్‌నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ శివారులో ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌ను సందర్శించారు. అనంతరం పట్టణంలోని పోలింగ్ కేంద్రం–62లో నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బూత్‌స్థాయి అధికారులతో పనుల నిర్వహణపై సమీక్షించారు. నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం 6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్పష్టమైన ఓటరు జాబితా తయారీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ మధూకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


