ఆసిఫాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం రాజంపేట్ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. ఉచిత బస్సు, విద్యుత్ మినహా ఇతర గ్యారంటీలు అమలు కావడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


