హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

● ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో గురువారం నిర్వహించే హనుమాన్‌ జయంతి వేడుకలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ నితిక పంత్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్‌ 100 కాల్స్‌పై సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయొద్దని సూచించారు. అనంతరం అన్ని పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌ కేసుల వివరాలపై ఆరా తీశారు. గంజాయి, మత్తు పదార్థాలు, మట్కా, జూదం, బెట్టింగ్‌ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీశ్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement