జైపూర్: మండలంలోని కాన్కూర్ అటవీ ప్రా ంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు. టీజీఎఫ్‌డీసీకి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలోని వాగులో రెండు చోట్ల నీటిఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూ డిక తొలగించి అడ్డుకట్టలు వేశారు. టీజీఎ ఫ్‌డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్‌లో వేసవిలో నీటి వృథాను అరి కట్టి జల సంక్షరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


