గురుకులాల్లో పిట్టల్లా రాలుతున్న విద్యార్థులు టీచర్ల వేధింపులే కారణమా? మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య అయినా పట్టింపేది..?
చెన్నూర్: గురుకుల విద్యాలయాలు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు పెట్టింది పేరు. గతంలో విద్యాబ్యాసం కఠినతరంగా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ విద్యార్థుల్లో కొరవడిందా, ఉపాధ్యాయుల వేధింపులు ఎక్కువయ్యయా అనే అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. వాచ్‌మెన్ నుంచి పాఠశాలల వరకు పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల తినుబండారాలను తనిఖీ చేసి లోనికి పంపిస్తారు. పాఠశాలకు గడ్డిమందు వచ్చిందంటే పర్యవేక్షణ కొరవడిందని చెప్పుచ్చు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గాడితప్పుతున్నారా అనే అనుమానులకు తావిస్తున్నాయి. మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం పట్ల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురుకులాల్లో విద్యార్థులు బయటికి వెళ్లాలంటే కేవలం దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగతారోజుల్లో మాత్రమే ఇళ్లకు పంపిస్తారు. నెలలో రెండు ఆదివారాల్లో తల్లిదండ్రులు వస్తే ఔటింగ్‌కు పంపిస్తారు. ఇన్ని నిబంధనలు ఉన్న విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న విషయం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
మృతుల వివరాలు ఇలా..
చెన్నూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి
చెన్నూర్ గురుకుల పాఠశాలలోనే మూడేళ్లలో ముగ్గురు మృతువాత పడ్డారు. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్‌కు గురయ్యారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో జరుగుతున్న వరుస ఘటనలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలల పై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలలో అధ్యాపకురాలు, విద్యార్థిని, మైనార్టీ గురుకులంలో విద్యార్థి చొప్పున ముగ్గురు మృతి చెందారు. మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో తోటి విద్యార్థిని కొడుతూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన పది మంది విద్యార్థులు సస్పెన్స్‌కు గురికాగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించారు.


