పాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్‌రెడ్డి కలిశా రు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి
పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సంక్షేమానికి రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, గత బడ్జెట్‌లో రూ.183 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలిపారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని, భవిష్యత్‌లో ఉద్యమాలకు సిద్ధం కావా లని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజుల రామచంద్ర, నాయకులు ఓదెలు, చందు, భాగ్య, శనిగారపు సత్యం, మామిడి రమేష్, కోటిపల్లి కళావతి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు.
పెళ్లికావడం లేదని యువకుడి ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: పెళ్లి కావడం లేదని మనస్తా పం చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ ఎస్సై సుధాకర్ తెలి పారు. ఆ యన కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన బంక సురేష్(30) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నా డు. గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈక్రమంలో సోమవారం ఇంట్లో వాసానికి లుంగీ తో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కడుపునొప్పి భరించలేక వ్యక్తి..
సిర్పూర్(టి): కడుపునొప్పి భరించలేక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై సాగర్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని పాతట్లగూడ కాలనీకి చెందిన పర్శన శంకర్(59) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ సా మాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


