కాగజ్‌నగర్‌టౌన్: సాగులో ఆధునిక సాంకేతికత పెంచి, రైతులకు శ్రమ, సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అ న్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో శుక్రవారం కొత్తపేట, దహెగాం, గురుడుపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం 40 శాతం సబ్సిడీతో మూడు సహకార సంఘాలకు డ్రోన్లు అందించిందని తెలి పారు. డ్రోన్ల ద్వారా పంటలపై మందుల పిచికారీ వేగంగా చేయవచ్చని, రైతులకు శ్రమ తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు డ్రోన్లు అందిస్తుందని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏవో రామకృష్ణ, ఏఈవో రేష్మిత, సొసైటీ సీఈవో సతీష్, రైతులు పాల్గొన్నారు.


