నిర్మల్‌లో వైద్యుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లో వైద్యుడిపై దాడి

Mar 27 2026 9:18 AM | Updated on Mar 27 2026 9:18 AM

● మూకుమ్మడిగా దాడి చేసిన ఓ వర్గం ● నిరసిస్తూ వైద్యులు, పార్టీలు, సంఘాల ఆందోళన ● గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌

నిర్మల్‌: జిల్లాకేంద్రంలోని ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు సంతోష్‌రాజ్‌పై ఓ వర్గం వ్యక్తులు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిని నిరసిస్తూ పట్టణంలోని వైద్యులందరూ ఆందోళనకు దిగారు. స్థానిక జయశంకర్‌ చౌరస్తాలో రోడ్డుపై గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. బిల్లుల విషయంలో సదరు ఆసుపత్రికి సిబ్బందితో ఓవర్గం వ్యక్తులు గొడవకు దిగారు. ఇదే క్రమంలో వైద్యుడు సంతోష్‌రాజ్‌పైనా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు.

వైద్యుల రాస్తారోకో...

తోటి వైద్యుడిపై దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని డాక్టర్లు అందరూ రోడ్డెక్కారు. ర్యాలీగా స్థానిక జయశంకర్‌ చౌరస్తాకు చేరుకొని బైఠాయించారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్‌ తోపాటు అన్ని పార్టీల కౌన్సిలర్లు, పలు సంఘాలు మద్దతు పలికాయి. గంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో బస్సులు, ఆటోలు, వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ సాయికిరణ్‌ వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఆందోళన కొనసాగించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి సైతం వైద్యులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement