పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

Mar 27 2026 9:18 AM | Updated on Mar 27 2026 9:18 AM

తానూరు: మండలంలోని బోరిగాం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జాదవ్‌ కృష్ణనంద్‌ పటేల్‌ను కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ గురువారం సస్పెండ్‌ చేశారని ఎంపీడీవో అమీర్‌ఖాన్‌ తెలిపారు. జాదవ్‌ కృష్ణనంద్‌ పటేల్‌ అసైన్డ్‌ భూమిలో 1–84,1–85 నంబర్లతో స్థలాన్ని సృష్టించి అదే స్థలంలో ఇళ్లు నిర్మాణానికి ప్రోసీడింగ్‌ జారీచేశారు. పూర్తి విచరణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఈమేరకు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ చర్యలు తీసుకున్నారని ఎంపీడీవో తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వి ద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యా క్షన్‌ కమిటీ(టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల డివిజన్‌ కార్యాలయం ఎ దుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు రానున్న నాలుగు రోజుల్లో విడతల వా రీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ తిరుపతి, కన్వీనర్‌ తోట నగేష్‌, కో చైర్మన్‌ ఉప్పలేటి నరేష్‌, రమేశ్‌ రాజు, ప్రభాకర్‌, మహేందర్‌, రమేశ్‌, సాగర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement