సౌత్‌జోన్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

రెబ్బెన: తమిళనాడులోని ఓని టెన్‌కాశీలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే ఇండియా సౌత్‌ జోన్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. పి.సాయిచరణ్‌, కె.అంజలి, జి.అనూష తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలో పాల్గొనున్న జిల్లా క్రీడాకారులను ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆర్‌.నారాయణరెడ్డి, సెపక్‌తక్రా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ రెడ్డి, అసోసియేషన్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, మారిన వెంకటేశ్వర్లు, పీఈటీ భాస్కర్‌, సీనియర్‌ క్రీడాకారులు నరేశ్‌, మల్లేశ్‌, శ్రీకాంత్‌, గోపాల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement